ఎన్టీఆర్ లేకుంటే సినిమా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జై లవకుశ’ సినిమాకొస్తున్న రెస్పాన్స్ చూసి చాలా షాక్ అయ్యాను అని అంటున్నాడు దర్శకుడు బాబి. పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల తరువాత బాబి దర్శకత్వం వహించిన చిత్రం ‘జైలవకుశ’. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయం వైపు పయనిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబితో ఇంటర్వ్యూ..
* సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
- చాలా ఆనందంగా వుంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్.
* మూడు పాత్రలతో కథ చెప్పినపుడు ఎన్టీఆర్ ఎలా ఫీల్ అయ్యారు?
- నిజానికి ఈ కథ ఐదారేళ్ళ క్రితమే రాసుకున్నాను. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఒకరకమైన వ్యక్తులమధ్య తేడాలుంటే ఎలా వుంటుందన్న ఆలోచనతో కథ రాసుకున్నాను. ఈ కథ చెప్పినపుడు ఎన్టీఆర్ వారం టైమ్ అడిగాడు. తనకు నచ్చిందో లేదో అన్న డౌట్ వుండేది. వారం తరువాత తనే ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పాడు.
* జై పాత్ర నెగెటివ్ షేడ్‌లో వుంటుందని చెప్పారా?
- ముందే చెప్పాను. కథ చెప్పినపుడు జై పాత్రకు తను బాగా కనెక్ట్ అయ్యాడు. దాన్ని స్క్రీన్‌మీద చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్‌గా వుంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అదరగొట్టాడు.
* కథ ఎన్టీఆర్ కోసమే రాసుకున్నారా?
- ఔను. గతంలో అదుర్స్ సినిమా చూసినప్పుడు తనతో మూడు పాత్రలు చేయిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కలిగింది. కానీ దాని వర్కవుట్ చేసేవరకూ టైమ్ పట్టింది.
* మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా చేశాడు?
- ఒక నటుడు మూడు పాత్రలు చేయడం మామూలు విషయం కాదు. ఒకేసారి మూడు రకాల వేరియేషన్స్ చూపించాలి. పైగా ఈ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వున్న సన్నివేశాలు ఎక్కువగా వుంటాయి. దానికోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డాడు. ఆయన లేకుంటే ఈ సినిమా లేదేమో.
* క్లైమాక్స్‌లో జై పాత్రను ముగించడం కరెక్ట్ అంటారా?
- ఆ పాత్రను అలా చేశాం కాబట్టే ఈ స్థాయిలో స్పందన వస్తోంది. లేకుంటే మామూలు సినిమాగా మిగిలేది. అటు ప్రేక్షకులు కూడా ఈ విషయం గురించి కరెక్ట్ అని చెబుతున్నారు.
* మీ సినిమాలు ఎక్కువగా నార్త్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి, కారణం?
- ఏదైనా కొత్తగా చెప్పాలనే ప్రయత్నం. ఎందుకంటే సౌత్‌లో చాలా సినిమాలు వచ్చాయి. నార్త్ అయితే ఆడియెన్స్ కొత్తగా ఫీల్ అవుతారు. అందుకే ఆ ప్రయత్నం.
* ఇద్దరు హీరోయిన్‌లలో నివేదాకు ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు, కారణం?
- కథ చెప్పినపుడు ఇద్దరూ తప్పకుండా చేస్తామని ఒప్పుకున్నారు. అక్కడ పాత్ర పరిధిని బట్టి వారు చక్కగా నటించారు. అంతేతప్ప నివేదాకు తక్కువ స్కోప్ వుందని కాదు.
* మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
- రాజవౌళి సినిమా చూసిన తరువాత చాలా అద్భుతంగా చేశావు. మూడు పాత్రల్లో జై పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావని అనుకున్నాను. కానీ లవ, కుశ పాత్రలను కూడా అద్భుతంగా మలిచావు అని చెప్పడం మర్చిపోలేని కాంప్లిమెంట్.
* కళ్యాణ్‌రామ్ ఎలా రెస్పాండ్ అయ్యాడు?
- షూటింగ్ పూర్తి అయిన తరువాత పోస్ట్ ప్రొడక్షన్‌లో వున్నపుడు ఆయన అప్పుడే చెప్పేశాడు, సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని. రిజల్ట్ వచ్చిన తరువాత కూడా అదే కాన్ఫిడెంట్‌తో వున్నాడు. ఆయనిచ్చిన సపోర్టు మరువలేనిది.
* మరి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?
- బాబోయ్.. మళ్లీ ఇలాంటి రిస్క్ ఇప్పట్లో చేయలేను. ఎందుకంటే మూడు పాత్రలను డీల్ చేయడం మామూలు విషయం కాదు. గ్రాఫిక్స్‌కు అత్యంత స్కోప్ వున్న సినిమాను తక్కువ సమయంలో చేయడానికి చాలా కష్టపడ్డాం.
* తదుపరి చిత్రాలు
- ప్రస్తుతానికి ఇంకా ఏమీ అనుకోలేదు. రెండు నెలలు హాలీడేస్ ఎంజాయ్ చేసిన తరువాత ఆలోచిస్తా.

- శ్రీ