దళపతి ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదా, కవితా అగర్వాల్, బాబు, ప్రియాంక శర్మ ప్రధాన తారాగణంగా ఆది అక్షర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి రూపొందించిన చిత్రం ‘దళపతి’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి స్పందన పొందుతోందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. దర్శకుడు సదా మాట్లాడుతూ- రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో, ఆ రాజును ప్రజలను చుట్టూ వుండేవారిని కాపాడే దళపతి కూడా అంతే ముఖ్యమైనవాడని, సైన్యా న్ని ముందుండి నడిపే దళపతి రాజ్యానికి వెన్నుదన్నుగా వుండే అతను ఏం చేశాడు అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని, యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పాత్రలమధ్య వచ్చే భావోద్వేగాలు ప్రేక్షకులకు నచ్చుతాయని, కెమెరా పనితనం ఈ సినిమాలో హైలెట్‌గా వుంటుందని, విజువల్స్ థ్రిల్లింగ్ కలిగిస్తాయని ఆయన అన్నారు.