ఊటీలో సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, అను ఇమాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీ్ధర్ రూపొందిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ చిత్రానికి సంబంధించిన హైదరాబాద్ షూటింగ్ పూర్తిచేసి ఊటీలో జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- సినిమా గురించి ప్రకటించినప్పటినుండి అంచనాలు అనూహ్యంగా పెరిగాయని, అర్జున్‌నుండి మరో కొత్త చిత్రం రానున్నదని అభిమానులు ఎదురుచూస్తున్నారని, వచ్చే ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నామని ముందే ప్రకటించడంతో అన్ని కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నామని తెలిపారు. ఊటీలో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని, బొమ్మన్ ఇరానీ ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడని దర్శకుడు తెలిపారు. శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, కెమెరా: రాజీవ్ రవి, సంగీతం:విశాల్ శేఖర్, నిర్మాత: శిరీషా శ్రీ్ధర్, రచన, దర్శకత్వం:వక్కంతం వంశీ.