అసహనంపై మేధావుల దూకుడు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత అసహనంపై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న చర్చను ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు శేఖర్‌కపూర్ స్వాగతించారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా ఈరోజు మీడియా సెంటర్‌లో శేఖర్‌కపూర్ విలేకరులతో మాట్లాడారు. అసహనంపై చర్చ మంచిదే అయినా ఈ విషయంలో మేధావులు ప్రదర్శించే దూకుడు సమాజానికి భారంగా మారకూడదని పేర్కొన్నారు. సమాజంలో 40 శాతం కంటే ఎక్కువ మంది తినడానికి తిండి లేని పేదవారున్న భారత్‌లాంటి సమాజంలో అసహనం ఉంటుందని అన్నారు. సమాజం గొంతును వినిపించాల్సింది మేధావులేనని చెప్పారు. అయితే మేధావుల దూకుడు సమాజానికి భారంగా మారడంవల్లనే సమస్య అని శేఖర్‌కపూర్ పేర్కొన్నారు. అటువంటి దూకుడును తాను సమర్ధించలేనని స్పష్టం చేశారు.