రాజవౌళితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ 27న విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రెండు షెడ్యూళ్లు జరుపుకున్న సినిమా తరువాత మహేశ్ మరో క్రేజీ ప్రాజెక్టు చేయడానికి సిద్ధమయ్యాడు. బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాజవౌళి దర్శకత్వంలో ఈ చిత్రం వుంటుందట.
ఇప్పటికే ఈ ఇద్దరిమధ్య చర్చలు కూడా జరిగాయని తెలిసింది. రాజవౌళితో సినిమా చేయడానికి మహేష్ ఆసక్తిగా వున్నాడన్న విషయం ఆయన చాలాసార్లు చెప్పారు. తాజాగా ఈ డ్రీమ్ ప్రాజెక్టు పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. తాజాగా స్పైడర్ విడుదలకు సంబంధించి జరిగిన ఇంటర్వ్యూలో మహేష్ స్పందిస్తూ రాజవౌళితో సినిమా వుంటుందని అది వచ్చే ఏడాది 2018 చివరిలో సెట్స్‌పైకి వస్తుందని తెలిపాడు. మొత్తానికి వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో తెరకేక్కే సినిమా అంటే పెద్ద సంచలనమే అని చెప్పాలి.