పాటల్లో సోడా గోలీసోడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానస్ హీరోగా హరిబాబు మల్లూరి దర్శకత్వంలో ఎస్‌బి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భువనగిరి సత్య సింధు నిర్మిస్తున్న సోడా గోలీసోడా చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడదులయ్యాయి. ప్రముఖ నటుడు హరికృష్ణ సిడిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, ఆలీలతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ చిత్రంలోని పాటలు బాగున్నాయి, ముఖ్యంగా ట్రైలర్ ఆకట్టుకుంది, తప్పకుండా సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ టైటిల్ చాలా ఆకర్షించేలా వుంది, ఈ సినిమాతో మానస్ స్టార్ హీరోగా ఎదగాలి అన్నారు. మానస్ మాట్లాడుతూ మంచి కథతో తెరకెక్కిన చిత్రమిది, అన్నిరకాల కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అన్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ వైవిధ్యభరితమైన కథా కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులు నచ్చేలా ఉంటుంది, మిగతా కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసి చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేస్తాం అన్నారు.