కొత్త దర్శకుడితో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. భారీ అంచనాల మధ్య వచ్చిన డిజె సినిమా ఆ స్థాయిలో కమర్షియల్‌గా ఆకట్టుకోలేకపోయింది. దాంతో మంచి సక్సెస్ కోసం కష్టపడుతున్నాడు. మిలటరీ అధికారిగా కనిపించనున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకుడుగా మారుతూ తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఆయన మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈసారి కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడట. ఓ యువ దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పాడట. దాంతోపాటు తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. మరి కొత్త దర్శకుడితో నాపేరు సూర్య సినిమా తరువాత చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ ఎప్పుడూ సక్సెస్ ఫుల్ దర్శకులతోనే సినిమాలు చేసాడు. కానీ తాజాగా ఆయన స్టయిల్ మార్చి కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.