సినిమాల విషయంలో తొందర పడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటిగా, టీవీ వ్యాఖ్యాతగా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి అటు హీరోయిన్‌గా కూడా తన ప్రయత్నాలు చేస్తునేవుంది. దొంగాట సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె ప్రస్తుతం టీవీ షోలతోపాటు వెబ్ సిరీస్‌లు చేస్తోంది. నేడు మంచులక్ష్మి జన్మదినం సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలు...పుట్టిన రోజును పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం నాన్ననుండి నేర్చుకున్నాను. ఈ పుట్టినరోజుకి ప్రత్యేకంగా రిజల్యూషన్స్ అంటూ ఏమీ లేవు. ప్రస్తుతం ఫిదా అనే టీవీ షో చేస్తున్నాను. దాంతోపాటు వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేసాను. భర్తను వదిలేసి భార్య వారంరోజులు పుట్టింటికి వెళ్లిపోతే ఎలా వుంటుంది అనే కానె్సప్ట్‌తో అది తెరకెక్కిస్తున్నా. దాంతోపాటు పీపుల్స్ మీడియా బానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తాడు. సినిమాల విషయంలో తొందరపడడం నాకిష్టం లేదు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని సినిమాలు చేయాలన్నది నా ఆలోచన. నేనుసైతం షో చేసినపుడు మనిషికి ఇన్ని కష్టాలుంటాయా అని తెలిసింది. చాలామంది జీవితాల్లో వెలుగులు నింపాం. అంతకంటే ఏం కావాలి. ఈ మధ్య సోషల్ మీడియా బాగా ఇంపాక్ట్ చూపిస్తోంది. సోషల్ మీడియాలో నేను యాక్టివ్‌గా వుంటాను. నెగిటివ్ కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోను, ప్రస్తుతం మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నా, తనకు ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను అంటూ ముగించారు.