తమన్నా తగ్గించింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా అంటే ఎలాంటి క్రేజ్ వుందో చెప్పాల్సిన పనిలేదు. వరస సినిమాలతో బిజీగా వున్న ఈమె రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకుంటుండడంతో అవకాశాలు తగ్గాయి. దానికి తోడు ఎన్నో ఆశలుపెట్టుకున్న అభినేత్రి పరాజయం పాలవడంతో అవకాశాలు తగ్గాయి. మరోవైపు ఐటం గర్ల్‌గా కూడా క్రేజ్ తెచ్చుకుంటున్న ఈ గ్లామరస్ బ్యూటీ తాజాగా ఎన్టీఆర్ ‘జై లవకుశ’లో ఐటం సాంగ్ చేసింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవడంతో తన పారితోషికాన్ని కూడా బాగా తగ్గించేసిందట. మరోవైపు ఐటెం సాంగ్‌కోసం కూడా భారీగానే వసూలు చేస్తున్న ఈమెకు కెరీర్ నెమ్మదించడంతో సరైన సమయంలో రెమ్యూనరేషన్ తగ్గించి మంచి నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రస్తుతం తమన్నాకు వరస అవకాశాలు వస్తున్నాయట. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేస్తున్న తమన్నా తెలుగులో క్వీన్ చిత్రంలో నటిస్తోంది. మొత్తానికి అవకాశాలు తగ్గిపోవడంతోనే తమన్నా రెమ్యూనరేషన్‌ను భారీగా తగ్గించిందని వార్తలు వస్తున్నాయి.