13న గల్ఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతన్, డింపుల్ హయాతీ జంటగా సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘గల్ఫ్’. నిర్మాత యెక్కలి రవీంద్రబాబు. గల్ఫ్ వలసల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 13న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ బ్యానర్‌లో తెరకెక్కుతున్న 16వ చిత్రం ఇది, గల్ఫ్ వలస బాధితుల కథతో తెరకెక్కిన సినిమా ఇది. దాదాపు నాలుగు వందలకుపైగా గల్ప్ బాధితులతో మాట్లాడి అక్కడి సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిచాం. గోదావరి జిల్లాల్లోని అమ్మాయి గల్ఫ్‌లోని అరబ్ షేక్‌ల ఇంట్లో పని చేయడానికి వెళుతుంది. అలాగే తెలంగాణ సిరిసిల్ల ప్రాంతం నుంచి చేనేత కార్మికుడి కొడుకు నిర్మాణ రంగంలో కూలీగా గల్ఫ్‌కు వెళతాడు. వారిద్దరి మధ్య సాగే ప్రేమ కథతోపాటు అక్కడికి పనికోసం వెళ్లే భారతీయులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ముఖ్యంగా చేయని తప్పులకు జైలు శిక్షలు అనుభవిస్తూ మహిళలు శారీరక హింసలకు గురవుతున్నారు. ఇంత పెద్ద సమస్యపై ఎవరూ ఇప్పటివరకు సినిమా చేయలేదు. వారి సమస్యలను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేసాం, తొంభై శాతం అరబ్ దేశాల్లోనే చిత్రీకరించారు. ఇందులో ఒక అరబిక్ సాంగ్ ఉంటుంది అన్నారు. హీరో చేతన్ మాట్లాడుతూ ఇది నా రెండోచిత్రం, ఇలాంటి రియలస్టిక్ అంశాలతో తెరకెక్కిన చిత్రంలో నటించడం ఆనందంగా వుంది, తప్పకుండా నాకు మంచి గుర్తింపు వస్తుంది అన్నారు. ఈ చిత్రాన్ని 300కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సబ్ టైటిల్స్‌తో విడుదల చేస్తున్నాం అన్నారు.