విజయంతో బాధ్యత పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన కథనాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మారుతి. తాజాగా శర్వానంద్, మెహరీన్ జంటగా తెరకెక్కించిన మహానుభావుడు చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. నేడు మారుతి పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో పంచుకున్న విశేషాలు...
బాధ్యత పెంచింది...
‘మహానుభావుడు’ చిత్రం దసరాకు విడుదలై యునానిమస్‌గా హిట్ టాక్‌ను తెచ్చుకుని భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మేం ఊహించిన దానికన్నా పెద్ద విజయాన్ని అందించారు ప్రేక్షకులు. తప్పకుండా ఈ విజయం నాలో మరింత బాధ్యతను పెంచింది.
అన్ని జోనర్స్‌లో..
ఒకే తరహా సినిమాలు తీయాలని నాకు లేదు. అన్ని రకాల సినిమాలు చేస్తాను. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాధాన్యంగా సాగేలా సినిమాలు వుండాలని నా కోరిక. దాంతోపాటు చిన్న మెసేజ్ కూడా వుంటే బాగుంటుంది. నేను హీరోను దృష్టిలో పెట్టుకుని కథ తయారుచేసుకుంటా.
శర్వా తప్ప...
మహానుభావుడు పాత్రను శర్వానంద్ తప్ప మరెవరూ చేయలేనంతగా ఆ పాత్రలో తను లీనమయ్యాడు. అటు ప్రేక్షకులనుంచి కూడా శర్వాకు మంచి అభినందనలు వస్తున్నాయి.
తదుపరి చిత్రం...
నా నెక్స్ట్ చిత్రం నాగచైతన్యతో వుంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఓ అందమైన ప్రేమకథగా ఇది ఉంటుంది. అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్‌గా నటించే ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. నవంబర్‌లో షూటింగ్ మొదలుపెడతాం.
బన్నీ, ప్రభాస్‌లకోసం...
అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలని ఉంది. దానికోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను. దాంతోపాటు ప్రభాస్‌తో కూడా అవకాశం వస్తే సినిమా చేస్తా.
నిర్మాతగా...
మారుతి టాకీస్ బ్యానర్‌పై మూడు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా లండన్‌బాబులు విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతోపాటు రెండు చిత్రాలు ప్రొడక్షన్‌లో వున్నాయి.

- శ్రీ