ఎన్టీఆర్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం జైలవకుశ సినిమాతో జోరుమీదున్న ఎన్టీఆర్ తదుపరి చిత్రంగా త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకోసం ఎన్టీఆర్ ప్రత్యేక ట్రైనింగ్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆయన ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా అను ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశాడట త్రివిక్రమ్. కానీ ఈ సినిమాకోసం అమీ జాక్సన్‌ను హీరోయిన్‌గా తీసుకురావాలని ఎన్టీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఎవడు సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ అందుకున్న అమీ జాక్సన్, అప్పుడప్పుడు హాట్ హాట్ షోలతో సంచలనం రేపుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో సెటిల్ అయిన ఈమె, రజనీ సరసన రోబో 2.0 చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు మరో తమిళ చిత్రంలో నటిస్తున్న అమీని ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా పెట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపేందుకు దర్శక నిర్మాతలు రంగంలోకి దిగారట. మరి ఎన్టీఆర్ సరసన అమీ నటిస్తే ఆమె గ్లామర్ సోకులు ఏ రేంజ్‌లో వుంటాయో చూడాలి!