నేతాజీ బయోపిక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో బయోపిక్ సినిమాలంటే ఎలాం టి క్రేజ్ వుందో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపి రుజువు చేశాయి. అందుకే బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆ తరహా ప్రయత్నాలు మానడంలేదు. తాజాగా స్వాతంత్య్ర సమరయోధు డు నేతాజీ జీవిత కథతో సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రయత్నం చేస్తున్నది ఎవరో కాదు తెలుగు దర్శకుడు? అవునా.. అలాంటి క్రేజీ ప్రయత్నం చేస్తున్నది తెలుగు దర్శకుడా? ఎవరు అంటూ షాక్ అవుతున్నారా? ఆయన ఎవరో కాదు.. లేటెస్టుగా రానాతో ఘాజి సినిమా తీసిన సంకల్ప్‌రెడ్డి. ప్రస్తుతం సంకల్ప్‌రెడ్డి రెండో ప్రయత్నంగా హిందీలో నేతాజీ బయోపిక్‌ను తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. నేతాజీ జీవితం ఇప్పటికే రహస్యంగా ఉంది. ఆయన ఇంకా బతికి ఉన్నాడని కొందరు, లేదు మరణించారని కొందరు చెబుతున్నారు. అసలు నేతాజీ జీవిత కథ ఎలా వుందో ఈయన చెబుతాడట. మరి ఈ సినిమాలో ఎవరు నటిస్తారు అన్న వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.