సుశాంత్ హీరోగా చి.ల.సౌ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజ్ వీర్ నాయుడు సమర్పించు, సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. సుశాంత్ హీరోగా ప్రమఖ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. రుహాని శర్మ ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతోంది. హీరో హీరోయిన్లపై పీల గోవింద్ సత్యనారాయణ (అనకాపల్లి ఎంఎల్‌ఏ) ముహూర్తం క్లాప్ కొట్టారు. అలాగే మలశాల దానమ్మ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించడం జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ- చాలా ప్యాషన్‌తో ఉన్న నిర్మాతలతో పనిచేస్తున్నందుకు ఆనందంగా వుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈయన మెంటల్ మదిలో, వెళ్లిపోమాకే సినిమాలకు పనిచేశారు. అలాగే మా సినిమా ఎడిటర్ చోట కె.ప్రసాద్ డీజే, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలకు వర్క్ చేశారు. ఈ సినిమా ద్వారా కొత్త సుశాంత్‌ని చూస్తారు అన్నారు. హీరో సుశాంత్ మాట్లాడుతూ- కథ బాగా నచ్చి చేస్తున్న సినిమా ఇది. రాహుల్ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని నమ్మకం ఉంది. చాలా గ్యాప్ తరువాత మంచి లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది అన్నారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి మాట్లాడుతూ- ఈ చిత్రం నా కెరీర్‌కు చాలా హెల్ప్ అవుతుంది. రాహుల్ కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: భరత్‌కుమార్ మాలశాల, హరి పులిజల, జస్వంత నాడిపల్లి, కెమెరామెన్: ఎం.సుకుమార్, సంగీతం:ప్రశాంత్ విహారి, ఎడిటర్: చోట కె. ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయిల గుండ్ల, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ.