హీరోగా గుర్తింపునిచ్చే గల్ఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతన్, డింపుల్ హయాతి జంటగా ఒక రొమాంటిక్ క్రైం కథ, గంగపుత్రులు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘గల్ఫ్’. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా ఇందులో హీరోగా నటిస్తున్న చేతన్ మీడియాతో చెప్పిన విశేషాలు.. గల్ఫ్ బాధితుల నేపథ్యంలో తెరకెక్కిన సందేశాత్మక చిత్రమిది. తెలుగు రాష్ట్రాల్లో గల్ఫ్ బాధితుల సంఖ్య ఎక్కువే. ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లి ఎన్నో సమస్యల్లో చిక్కుకున్న వారి జీవిత కథల ఆధారంగా దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి రీసెర్చి చేసి తెరకెక్కించిన కథ ఇది. నిజ జీవిత కథలతో తెరకెక్కిన ఈ చిత్రంలో నేను కరీంనగర్ నుండి గల్ఫ్‌కు వలస వెళ్ళే చేనేత కార్మికుడి కొడుకుగా నటిస్తున్నాను. అక్కడ నిర్మాణ రం గంలో లేబర్‌గా నటిస్తాను. హీరోగా నాకిది రెండో చిత్రం. ఇందులో నటనకు మంచి స్కోప్ వుంది. సామాజిక అంశాలతోపాటు కమర్షియల్ హంగులు ఉన్న ఈ చిత్రాన్ని శుక్రవారం భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. తప్పకుండా నాకు హీరోగా మంచి గుర్తింపునిచ్చే చిత్రమిది అన్నారు.