వస్తున్నాడు సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, మెహరీన్ జంటగా ప్రముఖ తమిళ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో సందీప్‌కిషన్ మాట్లాడుతూ- సుశీంద్రన్ దర్శకత్వంలో ‘నాపేరు శివ’ తరహాలో సాగే సినిమా ఇది. మధ్యతరగతి వారి ఫీలింగ్స్‌ను చక్కగా ఎలివేట్ చేస్తారు. ఇంత మంచి అవకాశం నాకు రావడం ఆనందంగా వుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సంగీత దర్శకుడు ఇమాన్ తొలిసారిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నవంబర్ రెండవ వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ ఇందులో మంచి పాత్ర చేస్తున్నాను. ఇంత మంచి సినిమాలో అవకాశం దక్కినందుకు ఆనందంగా వుంది. తెలుగు తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాతో తమిళ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాను అన్నారు. నిర్మాత చక్రి మాట్లాడుతూ- పాట చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నేటితో షూటింగ్ పూర్తిచేసుకుంది. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే పాటలను విడుదల చేస్తామన్నారు. దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ- ‘నా పేరు శివ’ తరహాలో సాగే కథ ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది అన్నారు.