శ్రీకరం శుభకరం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంత్ నిమ్మని, ఐంద్రిల్లా చక్రవర్తి జంటగా గోధా క్రియేషన్స్ పతాకంపై వానమామలై కృష్ణదేవ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీకరం శుభకరం నారాయణీయం’ చిత్రం గురువారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సముద్రాల వేణుగోపాలా చారి క్లాప్‌నివ్వగా శ్రీమతి మధు కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం దర్శక నిర్మాత కృష్ణదేవ్ మాట్లాడుతూ- ఈమధ్యకాలంలో యువత ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన వంటి విషయాలను పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా చెడు మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. వారిని మంచి మార్గంలో పయనింపజేయడమే ఈ చిత్ర ముఖ్య ఉద్దేశ్యం. నవంబర్ నెలాఖరు నుంచి చిత్రీకరణ మొదలుపెట్టి జనవరి చివరికల్లా పూర్తి చేస్తాం అన్నారు. హీరో ప్రశాంత్ నిమ్మని మాట్లాడుతూ- మంచి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర ఇది అన్నారు. హీరోయిన్ మాట్లాడుతూ- మైథలాజికల్ కథతో సోషల్ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నందుకు ఆనందంగా వుంది అన్నారు. సంగీత దర్శకుడు రామారావు మాట్లాడుతూ- ఈ చిత్రంలో ఏడు పాటలు ఉన్నాయి. ఏసుదాసు, బాలు లాంటి ప్రముఖ గాయకులు పాడుతున్నారు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లేశ్ నాయుడు, సంగీతం: తారక రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: వానమామలై కృష్ణదేవ్.