రంగంలోకి భరత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ‘స్పైడర్’ సినిమా తరువాత నటిస్తున్న ‘్భరత్ అనే నేను’ చిత్రం ఇటీవలే ఓ షెడ్యూల్ జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హాలీడేస్‌లో వున్న మహేష్‌బాబు విదేశాలనుండి ఇండియాకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌లో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి జరిగే మరో షెడ్యూల్‌లో మహేష్ పాల్గొంటాడట. వచ్చే ఏడాది విడుదల చేయనున్న ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కన్పిస్తాడని వార్తలొస్తున్నాయి. ‘శ్రీమంతుడు’ సంచలన విజయం తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో అసెంబ్లీ సెట్‌లో ప్రత్యేక సన్నివేశా ల చిత్రీకరణ జరిగింది. మహేష్ సరసన ఖైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.