మహేష్ సరసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్‌సింగ్ ఇటీవలే మహేష్ సరసన ‘స్పైడర్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత మరోసారి ఆమె మళ్లీ మహేష్‌తో నటించేందుకు సిద్ధమైందట. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్న రకుల్, మరోవైపు తమిళ్‌లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా మహేష్‌తో జోడీకట్టిన ఈమె టాలెంట్‌కు మెచ్చిన మహేష్ మరోసారి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడట. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ‘్భరత్ అనే నేను’ చిత్రంలో నటిస్తున్న మహేష్, తదుపరి చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించే చిత్రం జనవరిలో మొదలుకానుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో రకుల్‌ని హీరోయిన్‌గా ఎంచుకున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపినట్టు తెలిసింది. మొత్తానికి మహేష్‌తో వరుసగా అవకాశాలు కొట్టేస్తూ జోరుమీద వున్న రకుల్‌కు అటు సేవాభావాలు కూడా ఎక్కువే. తాజాగా బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమానికి తెలంగాణ తరఫున బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది.