రోబో రాణీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో 2.0’. సూపర్‌స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏకంగా 400కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో అమీ జాక్సన్ కూడా రోబో గెటప్‌లో వుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రజనీకాంత్‌తోపాటు అమీ జాక్సన్ కూడా రోబో పాత్రలో నటిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో వచ్చిన రోబో చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ కాదని చెబుతున్నాడు శంకర్. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనే కాకుండా చైనా, అరబ్ వంటి విదేశీ భాషల్లో కూడా డబ్ చేసి భారీగా విడుదల చేస్తారట.