భయపెట్టే దేవిశ్రీప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజా రామచంద్రన్, మనోజ్ నందన్, ధన్‌రాజ్ ముఖ్యపాత్రల్లో శ్రీకిశోర్ దర్శకత్వంలో ఆర్.వి.రాజు, ఆక్రోశ్ నిర్మిస్తున్న ‘దేవిశ్రీప్రసాద్’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మా త మల్కాపురం శివకుమార్ సీడీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మధుర శ్రీ్ధర్, శివబాలాజీ, తా.రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ- ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తు తం తెలుగులో హర్రర్ చిత్రాల హవా జోరుగా వుంది. మంచి కథ, కథనంతో సినిమాలు చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ తరహాలోనే దేవిశ్రీ ప్రసాద్ చిత్రం కూడా మంచి విజయం సాధించాలి అన్నారు. మధుర శ్రీ్ధర్ మాట్లాడుతూ- టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది. శ్రీకిశోర్ మంచి టాలెంట్ వున్న దర్శకుడు. తప్పకుండా ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోతాడు అన్నారు. దర్శకుడు శ్రీకిశోర్ మాట్లాడుతూ- గతంలో భూ సినిమా చేశాను. నాకిది రెండో చిత్రం. హర్రర్ చిత్రమైనా కూడా భిన్నమైన స్క్రిప్ట్‌తో చేస్తున్న ప్రయత్నమిది. తప్పకుండా మాకు సపోర్టు అందిస్తానని కోరుకుంటున్నానన్నారు. హీరోయిన్ పూజ మాట్లాడుతూ- కథ చెప్పగానే షాక్ అయ్యాను. ముఖ్యంగా ఇలాంటి బోల్డ్ సినిమా చేయడం అవసరమా అనిపించింది. కానీ నటిగా నాకు మంచి గుర్తింపు తెచ్చే చిత్రం అవుతుంది. శ్రీకిశోర్ అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా భూపాల్ నటనతో భయపెట్టాడు. నా కెరీర్‌లో నిలిచిపోయే చిత్రంగా నిలుస్తుంది అన్నారు.