జాలీడేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‌ని ఎంజాయ్ చేస్తోంది. కెరీర్ మొదట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నా కూడా ప్రస్తుతం ఆమెకు వరుసగా పరాజయాలు పలకరించాయి. తాజాగా నాగచైతన్యతో చేసిన యుద్ధం శరణం చిత్రం అనుకున్న స్థాయిలో విజ యం సాధించకపోవడంతో ఈమెకు కొత్త అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దాం తోపాటు రెండు క్రేజీ ప్రాజెక్టులనుంచి తప్పకోవడంతో ఈమెపై నెగెటివ్ ప్రచారమూ జరిగింది. ప్రస్తుతం సినిమాల గురించి ఎక్కువగా పట్టించుకోకుండా హాయిగా ఫ్యామిలీతో షికార్లు చేస్తోంది. మలేసియాలో జాలీగా గడుపుతున్న లావణ్య, తెలుగులో రెండు సినిమాల్లో నటించేందుకు ఓకె చెప్పింది. దాంతోపాటు మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. మొత్తానికి కెరీర్ పరంగా పెద్దగా టెన్షన్ పెట్టుకోకుండా జాలీగా ఎంజాయ్ చేస్తోంది.