ఎమోషనల్ డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఇంద్రసేన’. ఆర్.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌లపై జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధిక శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ- ఇంద్రసేన లాంటి పవర్‌ఫుల్ పాత్రను చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాగే బిచ్చగాడు లాంటి ఎమోషనల్ పాత్రను విజయ్ పోషించాడు. ఈ రెండు తరహా పాత్రలు ఇంద్రసేనలో ఉంటాయి. తప్పకుండా విజయ్‌కి ఈ సినిమా మరో సంచలన విజయాన్ని అందిస్తుంది అన్నారు. రచయిత భాషాశ్రీ మాట్లాడుతూ- బిచ్చగాడు సంచలన విజయం తరువాత వచ్చిన సినిమాలన్నీ వేటికవే భిన్నంగా రూపొందాయి. తాజాగా మరో అద్భుతమైన కథతో వస్తున్న ‘ఇంద్రసేన’ తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు. హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ- ఎమోషనల్ డ్రామాగా సాగే కథ ఇది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా వుంటుంది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి మాటలు: బాషాశ్రీ, సంగీతం, ఎడిటింగ్: విజయ్ ఆంటోని, కెమెరా: కె.దిల్‌రాజు, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు: రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.