యూరప్ టూర్‌లో ఎన్టీఆర్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి జోరుమీదున్నాడు. ఆయన నటించిన జై లవకుశ సినిమా సంచలన విజయం సాధించడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే టాప్ 10 లిస్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ప్రస్తుతం మూడో నెంబర్‌లోకి చేరింది. దీంతోపాటు మొదటిసారిగా మూడు పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. మరోవైపు టెలివిజన్ రంగంలోకి అడుగుపెడుతూ హోస్ట్‌గా నిర్వహించిన ‘బిగ్‌బాస్’ షో కూడా సంచలన విజయం సాధించడంతో ఖుషీమీదున్న ఎన్టీఆర్, ప్రస్తుతం హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికి యూరప్ బయలుదేరనున్నాడట. ఫ్యామిలీతో కలిసి అక్కడే నెల రోజులపాటు ఉంటాడని సమాచారం. ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో తెరకెక్కనుంది. ఇప్పటికే కథా చర్చలు జరుపుకున్న ఈ చిత్రం జనవరిలో మొదలుకానున్నదట. ప్రస్తు తం పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా పూర్తయిన తరువాత ఎన్టీఆర్ చిత్రం సెట్స్‌పైకి రానుంది. ఎలాగూ రెండు నెలల గ్యాప్ వుంది కాబట్టి ఫ్యామిలీతో హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు.