స్పెషల్ థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగ, అక్షిత, సంతోష హీరో హీరోయిన్లుగా వాస్తవ్ స్వీయ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘స్పెషల్’. అజయ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తికావస్తున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక నిర్మాత వాస్తవ్ మాట్లాడుతూ- సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కే చిత్రమిది. డా. డేవిడ్ బురాన్ సైకలాజికల్ థీసిస్‌మీద చేసిన రీసెర్చి వల్ల చాలా విషయాలు తెలిశాయి. ఇలాంటి అంశాలతో చాలా పుస్తకాలను రిఫర్ చేసి ఈ కథ సిద్ధం చేసుకున్నా. తన పగ కోసం ప్రయత్నిస్తున్న అతని ప్రయత్నం ఎలా ఫలించిందీ అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో అజయ్ ఇనె్వస్టిగేటివ్ అధికారిగా ముఖ్యపాత్రలో కన్పిస్తాడు. ఆయన నటన సినిమాకు ప్రధాన హైలెట్ కానుంది. ఇందులో ఒక్క సాంగ్ మాత్రమే వుంటుంది. ఈ తరహా కథ రావడం తెలుగు సినిమా చరిత్రలోనే మొదటిదని చెప్పచ్చు. సైకలాజికల్ థ్రిల్లర్‌తోపాటు లవ్, ఎమోషన్, కామెడీ అన్ని అంశాలు వుంటాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో వుంది. మరో రెండు రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదల చేస్తాం అన్నారు.