జయప్రద సువర్ణసుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడంతా హిస్టారికల్ మూవీస్ హవా నడుస్తోంది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా భారీ నిర్మాణ సంస్థలన్నీ చారిత్రాత్మక చిత్రాల నిర్మాణంపై దృష్టిపెడుతూ భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడదే కోవలో రాబోతున్న చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుందనేది ట్యాగ్‌లైన్. సూర్య దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్ బానర్‌పై ఎమ్.ఎల్. లక్ష్మి ‘సువర్ణ సుందరి’ని తెరకెక్కిస్తున్నారు. అలనాటి మేటి నటీమణి జయప్రద ఓ ముఖ్య పాత్రను పోషిస్తుండగా ఈ పాత్రకు ఓ ప్రత్యేకత వుందని, గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రద పాత్ర వుంటుందన్నారు దర్శకుడు. ఇక పూర్ణకు కూతురుగా జయప్రద నటిస్తుండడంతో పాటు వారిద్దరి మధ్య వుండే ఎమోషన్ ఈ సినిమాకు ఓ హైలెట్‌గా చెప్పవచ్చు. నిజ జీవితం తరహాలోనే జయప్రద రోల్ ఈ చిత్రంలోను చాలెంజింగ్‌గా వుండడంతోపాటు పతాక సన్నివేశాల్లో డూప్ లేకుండా జయప్రద చేసిన స్టంట్స్ ‘సువర్ణ సుందరి’ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఇటీవల వీటికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందన్నారు దర్శకుడు సూర్య.