27న కాళరాత్రి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజెవైఎస్ ఆర్ట్స్ పతాకంపై పి.ఆర్.బాబు దర్శకత్వంలో కామెడీ, సెంటిమెంట్, హారర్ ప్రధానాంశాలుగా రూపొందనున్న ‘కాళరాత్రి’ చిత్రం షూటింగ్ ఈ నెల 27న గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. సంగీత దర్శకుడు సత్య కాశ్యప్ (ఐస్‌క్రీమ్ ఫేమ్) సంగీతం సమకూర్చగా గీతామాధురి, అక్షయ్, స్వరరాజ్ గానం చేయగా, నాలుగు పాటలు ఇటీవల రికార్డింగ్ చేసారు. ఈ చిత్రంలో హీరోగా నూతన నటుడిని పరిచయం చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. శాలినీసింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో జీవా, రాంజగన్, జాకీ, దువ్వాసి మోహన్, రాళ్లపల్లి, తిరుపతి ప్రకాశ్, చిట్టిబాబు తదితరులు నటించే ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటి ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య కాశ్యప్, కెమెరా: వెంకట్, ఎడిటింగ్: భద్రం, పాటలు: శివశంకర్, డాన్స్: సామ్రాట్, ప్రొడక్షన్ మేనేజర్స్: విజయ్, చంద్రశేఖర్, సహ నిర్మాతలు: తనూజ, జి.శ్రీనివాస్, వై.శేషిరెడ్డి, కోడైరక్టర్: ప్రవీణ్‌కుమార్, నిర్మాణం: విజెవైఎస్‌ఆర్ ఆర్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.ఆర్.బాబు.