రాజరథంలో ఆర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రంగితరంగ’ చిత్రం చూసి ఇన్‌స్పైర్ అయి ‘రాజరథం’ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన ఆర్య, తన మొదటి సినిమాతోనే ఆస్కార్ అవార్డు నామినేషన్ వరకు వెళ్లిన దర్శకుడు అనూప్ భండారీ ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తున్నారు. జాలీహిట్స్ ప్రొడక్షన్స్ అధినేత అజయ్‌రెడ్డి గొల్లపల్లి ‘రంగితరంగ’ చిత్రాన్ని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ అనూప్ భండారీని ‘రాజరథం’ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తమిళ హీరో ఆర్య కన్నడ సినిమా రంగంలో అడుగుపెడుతున్నాడు. ‘రంగితరంగ’ సినిమాను థియేటర్‌లో వీక్షించిన ఆర్య అనూప్ భండారీ తండ్రి సుధాకర్ భండారీకి ఫోన్ చేసి తన అభినందనలు తెలియజేసారు. సినిమాలో తన క్యారెక్టర్ విన్న ఆర్య వెంటనే ‘రాజరథం’ సినిమాలో నటించడానికి రెండో ఆలోచన లేకుండా అంగీకరించారు ఆర్య .