థియేటర్ల రెంటల్ విధానం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న సినిమాలకోసం ప్రత్యేకంగా ఐదో ఆటను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణాగౌడ్, నిర్మాత సాయి వెంకట్ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి న పాత్రికేయుల సమావేశంలో ఆర్‌కె గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తరఫున కమిటీలో ఉన్న మంత్రు లు కెటిఆర్, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్‌లు సినిమా పరిశ్రమ కోసం పెండింగ్‌లో వున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు, అలాగే సింగిల్ విండో పద్ధతిలో చిన్న సినిమాలకు ఎఫ్‌డిసి ద్వారా పర్మిషన్ ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు. అలాగే చిన్న సినిమాలకోసం తప్పకుండా మరో షోను పెంచేందుకు జివో కూడా ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలని దాంతోపాటు థియేటర్లలో ఆన్‌లైన్ విధానంవల్ల ఎక్కడా బ్లాక్ మార్కెట్ జరిగే ఆస్కారం లేకుండా ఉంటుంది, ప్రతి రూపాయి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు అందుతాయి, ముఖ్యంగా సింగిల్ విండో విధానం వల్ల ఎఫ్‌డిసిలో వారం రోజుల ముందు చలానా కడితే ఎప్పుడైనా షూటింగ్ చేసుకోవచ్చు, ఆయా డిపార్ట్‌మెంట్లనుంచి పర్మిషన్లు అవసరం వుండదు, చిన్న సినిమాలకు ఒక షోను కేటాయించడంవల్ల దాదాపు 300 చిన్న చిత్రాలు విడుదల కాకుండా ఆగిపోయాయి, ఈ విధానం వల్ల ఆ చిత్రాలన్నీ విడుదలయ్యే అవకాశాలున్నాయి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతున్న తెలంగాణ ప్రభుత్వానికి, ఎఫ్‌డిసి చైర్మన్ రాంమోహన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నారు. నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ ఐదవ ఆట విధానాన్ని తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం, ముఖ్యంగా థియేటర్ రెంటల్ విషయంలో ఇక్కడ చాలా సమస్యగా మారింది, పక్క రాష్ట్రాల్లో కేవలం 2,500 మాత్రమే వసూలు చేస్తే ఇక్కడ మాత్రం పదివేల దాకా వసూలు చేస్తున్నారు. కొందరు పెద్దనిర్మాతల చేతుల్లో వున్న థియేటర్లలో రెంటల్ విధానం కూడా మారాలి, అప్పుడే చిన్న సినిమా బతుకుతుంది, ఈ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాం, త్వరలోనే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నాం, అలాగే థియేటర్లలో రెంటల్ విధానాన్ని తగ్గించుకంటే ధర్నాలు కూడా చేసేందుకు సిద్ధమని అన్నారు.