అర్జున్‌రెడ్డి దర్శకుడితో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి...టాలీవుడ్‌లో సంచలనం రేపిన చిత్రం. ఈ మధ్యకాలంలో ఈ రేంజ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా మరొకటి లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా మారాడు సందీప్. ఆయనకు ఇప్పుడు భారీ అవకాశాలు వస్తున్నాయి. నిర్మాతలు క్యూ కడుతూ ఎంతంటే అంత అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే సందీప్ నెక్స్ట్ ఫోకస్ పవన్ కల్యాణ్‌పై పడింది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఆయనతో ఈలోగా ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు సందీప్ వంగ. అందుకోసమే రంగంలోకి దిగిన సందీప్ పవన్‌కోసం కథను సిద్ధం చేస్తున్నాడట. పైగా మైత్రి మూవీస్ బ్యానర్ వాళ్లకు సందీప్‌కు అప్పుడే 50 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఆ బ్యానర్‌లో పవన్‌తో ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అర్జున్‌రెడ్డి సినిమా హిట్‌తో పవన్‌కళ్యాణ్ నుండి అభినందనలు అందుకున్న సందీప్‌కు పవన్ చాన్స్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో..అన్నీ కుదిరితే పవన్‌కళ్యాణ్‌తో సందీప్ తీసే సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.