కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు తనయు డు కృష్ణ హీరోగా బిజెఆర్ సమర్పణలో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మిస్తోన్న చిత్రం ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’. శ్రీనాథ్ పులకురం దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఎల్సా ఘోష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రా రంభోత్సం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నటుడు నరేష్ తొలి సన్నివేశానికి క్లాప్‌నివ్వగా, తనికెళ్ల భరణి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్‌షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా పాయింట్ విన్నాను. చాలా కొత్తగా ఉంది. ప్రస్తుతం సబ్జెక్ట్ కొత్తగా ఉంటే సినిమాలు ఆడుతున్నాయి. ఆ కోవలో ఈ సబ్జెక్ట్ బేస్డ్ ఫిలిం కాబట్టి కచ్చితంగా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ- ‘‘దర్శకుడు శ్రీనాథ్ కొత్త కథతో వచ్చి కలిశాడు. చాలా మంది పెద్దవాళ్లు కథ విని చాలా బాగుందనడంతో ముందుకు వెళ్తున్నాం. లవ్, సస్పెన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలుంటాయి. నా పాత్రపేరు అర్జున్. షావలిగారు మంచి పాటలు కంపోజ్ చేస్తున్నారు. సీనియర్ టెక్నీషియన్స్ సినిమాకు పని చేస్తున్నారు’’అన్నారు. దర్శకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ- ‘‘నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చాలా కాలం వర్క్ చేశాను. ఆ తర్వాత డిఎఫ్ టెక్ చేసి కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆ అనుభవంతో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. హీరో కృష్ణ ఈ సినిమా కోసం ఏడాదిపాటు మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. తనలో పాషన్ నాకు బాగా నచ్చింది. సూపర్ మార్కెట్ బ్యాక్ డ్రాప్‌లో సాగే లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ చిత్రమిది’’ అన్నారు.