రవితేజ నమ్మకం నిజం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి తొలి సినిమాతోనే మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు అనీల్ రావిపూడి. ఆ తరువాత తెరకెక్కించిన ‘సుప్రీం’ కూడా ఆయనకు మరింత ఉత్సాహాన్ని అందించింది. తాజాగా రవితేజతో ప్రయోగం చేస్తున్నాడు. అదే ‘రాజా ది గ్రేట్’ చిత్రం. దిల్‌రాజు సమర్పణలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడితో ఇంటర్వ్యూ..
* ఈ తరహా సినిమా కమర్షియల్‌గా ఎలా వర్కవుట్ అవుతుందనుకున్నారు?
- బ్లైండ్ కేర్ టేకర్‌ని చేయాలనుకున్నపుడు రిఫరెన్స్‌గా వుంటుందని కొన్ని సినిమాలు చూశాను. అందరూ సస్పెన్స్ థ్రిల్లర్లు, ఆర్ట్ ఫిలింస్ చేశారు కానీ కమర్షియల్ జోనర్‌లో చేయలేదు. అలా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ సినిమా చేశా.
* ఇది ఏ సినిమాకైనా రీమేకా?
- ఖచ్చితంగా కాదు. ఇండియాలో ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలు చూశాను. వేరే సినిమాలు కూడా చూశాను. కానీ ఈ సినిమా పూర్తిగా భిన్నంగా వుంటుంది. బ్లైండ్ పాత్ర అనగానే ఏదో అడ్వాంటేజ్ తీసుకుని చేసినట్టు కాకుండా దానిపై చాలా హోమ్‌వర్క్ చేశాం. వేరే సినిమాలను చూడడంవల్ల కాపీ కొట్టినట్టు కాదు. వాటినుండి స్ఫూర్తి పొందామంతే.
* ఈ పాత్రకి రవితేజ ఎలా ఒప్పుకున్నాడు?
- మొదట రవితేజకు కథ చెప్పినపుడు ఆయనతో నాకున్న పరిచయం ప్రకారం సరదాగా రమ్మన్నారు. వెళ్లాక ఎలాంటి కథ చేయాలో ఆయనకు తెలియదు. కానీ ఒక్కసారి కథ చెప్పిన తరువాత పూర్తిగా ఇన్‌వాల్వ్ అయి విన్నారు. కేవలం ఆయన నామీద వుంచిన నమ్మకంతోనే ఈ పాత్రను అంగీకరించారు.
* ముందుగా రామ్‌కు చెప్పినట్టున్నారు?
- అవును. రామ్‌కు కథ చెప్పిన మాట వాస్తవమే. అలాగే తారక్ దగ్గరకు కూడా వెళ్లినపుడు ఈ కథను చెప్పలేదు. అప్పుడున్న కథ వేరు. తారక్ తరువాత కథ పూర్తిగా మారిపోయింది.
* సందేశం ఇస్తున్నారా?
- సందేశంలాంటిది కాకుండా, హీరో పాత్రలోనే ఒక లోపం వుంది కాబట్టి పాత్రల మాటల్లో అక్కడక్కడా కన్పిస్తూ వుంటుంది. అంతేగానీ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాదు.
* ఈ సినిమాతో రిస్క్ చేస్తున్నానని అనిపించలేదా?
- మొదట్లో అనిపించింది. కానీ కథ, కథనం, దాన్ని తీసుకెళ్లే విధానం వల్ల సినిమాపై నమ్మకం పెరిగింది. ఈ పాత్రల్లో ఎంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను తీసుకురాగలమో అంతవరకు ప్రయత్నించాం.
* హైలెట్స్ గురించి?
- ఇందులో హీరో తల్లి పాత్రలో రాధిక నటించింది. ఆమె పాత్ర సాగే విధానం చాలా అద్భుతంగా వుంటుంది. నిజంగా ఆమెకు మళ్లీ ఇమేజ్ తీసుకొచ్చే పాత్ర ఇది. దాంతోపాటు ప్రకాష్‌రాజ్, అన్నపూర్ణమ్మ, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డిల పాత్రలు ఆకట్టుకుంటాయి.
* మరి నిర్మాతను ఎలా ఒప్పించారు?
- ఈ కథను ముందు దిల్‌రాజుకు చెప్పా. సుప్రీం తరువాత నెక్స్ట్ సినిమా ఏం చేద్దామని ఆలోచించినపుడు ఈ చిన్న లైన్ చెప్పా. ఆయన బాగుంది, డెవలప్ చేయమని చెప్పడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేశా.
* హీరోకి మధ్యలో కళ్లు వస్తాయా?
- రావు. హీరో పుట్టినప్పటినుంచి అంధుడిగానే కన్పిస్తాడు. అదేంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
* హీరో పాత్ర ఎలా వుంటుంది?
- తన కొడుకుని పోలీసుగా చూడాలనుకుంటుంది తల్లి. అయితే అతను అంధుడు కావడంతో దాన్ని అధిగమించేందుకు ఏం చేశారు అన్నది అసలు కథ. ఇందులో రవితేజ చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు నటించాడు.
* మరి ఈ పాత్రకోసం ఏదైనా హోమ్‌వర్క్ చేశారా?
- చేశాము. ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఎలా వుంటుంది అని చూశా. అతన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రేంజ్‌లో వుంటాయో తెలుసుకున్నాను. వారికి ఎక్కడా లోపం గురించిన ఆలోచనలు ఉండవు. వాళ్లు మనలాగే అన్ని రకాల పనులు చేస్తారు.
* తదుపరి సినిమా ఎవరితో?
- ఇప్పటికైతే ఎవరితో చేయాలన్న ఆలోచన లేదు. ఈ సినిమా తరువాత స్క్రిప్ట్‌ను బట్టి ఆ హీరోతో చేస్తా.

-శ్రీనివాస్