బాలయ్య చిత్రం క్లైమాక్స్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది. అరివుమణి, అంబుమణిల సారథ్యంలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌లు బాలయ్యపై చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా, హరిప్రియ, ప్రకాష్‌రాజా, బ్రహ్మానందం, మురళీమోహన్, జె.పి, ఎల్.బి.శ్రీరామ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాలుపంచుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ- ‘‘ఈనెల 5న మొదలైన క్లైమాక్స్ ఎపిసోడ్ 15వరకూ నిరాటంకంగా చిత్రీకరించడం జరిగింది. అరివుమణి-అంబుమణిలు అత్యంత నేర్పుతో సహజంగా ఉండేలా ఈ పోరాట సన్నివేశాలని డిజైన్ చేశారు. మూసాపేట్‌లోని కంటైనర్ యార్డ్‌లో ఈ కీలకమైన ఎపిసోడ్‌ను షూట్ చేశాం. ఇప్పటికే నయనతార, నటాషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హరిప్రియ మరో కథానాయికగా కనిపించనుంది’’ అన్నారు. ఇతర పాత్రల్లో ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, ఫైట్స్: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.