అన్నదారిలోనే తమ్ముడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపులర్ సినిమా దర్శకుడిగా టాలీవుడ్‌లో ఇమేజ్ తెచ్చుకున్న పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా పరిచయం అయి చాలా రోజులు అవుతుంది. పాపం ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఇతగాడికి సరైన విజయం మాత్రం దక్కడంలేదు. అవకాశాలు మాత్రమే వస్తూనే వున్నా.. విజయాలు దూరంగా వెళుతున్నాయి. దాంతో విసిగి వేసారిన శంకర్.. నెక్స్ట్ స్టెప్ అన్న దారిలోకి వచ్చేసాడు.. ఈసారి ఆయన దర్శకుడిగా మారతాడట! దానికోసం ఓ మంచి లవ్‌స్టోరీని రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ఆ దిశగా సన్నాహాలు మొదలుపెట్టాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుందని టాక్. అయితే సాయిరామ్ శంకర్ కొత్త వాళ్లతో సినిమా చేస్తాడా.. లేక లీడింగ్ హీరోలతో చేస్తాడా అన్నది తెలియాల్సి వుంది. సో..త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రానుంది. మొత్తానికి అన్న దారిలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిరామ్ శంకర్.. మరి దర్శకుడిగా ఎలా సక్సెస్ అవుతాడో చూడాలి