గ్లామర్ డోస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న తమన్నా అంటే సౌత్‌లో ఎలాంటి క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమన్నా గ్లామర్ అంటే ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. ఇక ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో హీరోయిన్‌గా ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న షాలిని పాండే.. తెలుసుగా.. ఆ ఒక్క సినిమాతోనే ఎవ్వరికీ రానంత క్రేజ్ తెచ్చుకున్న ఈ భామకు తమన్నాకు లింక్ ఏమిటి? అని షాక్ అవుతున్నారా.. ఉంది. అదేమిటంటే.. ఆమధ్య తమన్నా హీరోయిన్‌గా నటించిన ‘100 పర్సెంట్ లవ్’ ఇప్పుడు తమిళ రీమేక్‌లో షాలిని నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా ఆ సినిమాలో గ్లామర్‌ని బాగా చూపించింది కదా.. మీరు కూడా అలాగే గ్లామర్‌గా పాత్రలో కనిపిస్తారా? అని అడిగితే ఏమని చెప్పిందో తెలుసా.. నేను తమన్నాలా ఎందుకు చూపిస్తాను.. నాలాగే చూపిస్తాను అంటూ షాక్ ఇచ్చింది. తమన్నా ఆ సినిమాలో చాలా అందంగా కనిపించింది, బాగా చేసింది.. నేను కూడా ఈ పాత్రలో గ్లామర్‌గా ఆకట్టుకోవడమే కాకుండా ఆమెకన్నా ఇంకాస్త గ్లామర్‌గా కనిపిస్తా అంటూ షాక్ ఇచ్చింది. సో మొత్తానికి అర్జున్‌రెడ్డి హీరోయిన్ ఫోకస్ అంతా ఇప్పుడు గ్లామర్‌పైనే పడిందన్నమాట. చూద్దాం ఏ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుందో మరి!