నాని చిత్రలహరి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న నాని, మరో హ్యాట్రిక్ కోసం సన్నాహాలు గట్టిగానే చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఎంసిఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో నటిస్తున్న నాని, దాంతోపాటు మేర్లపాక గాంధి దర్శకత్వంలో ‘కృష్ణార్జునయుద్ధం’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ చిత్రానికి కూడా ఓకె చెప్పాడట. ప్రస్తుతం రామ్‌తో ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందట. ఇప్పటికే వీరిమధ్య కథా చర్చలు జరిగాయని, కథ నచ్చడంతో నాని ఓకె చెప్పేశాడట. అన్నట్టు ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా? ‘చిత్రలహరి’. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి. ‘చిత్రలహరి’ అప్పట్లో దూరదర్శన్‌లో ప్రతి శుక్రవారం ప్రసారమయ్యే పాటల కార్యక్రమం గుర్తుకు వచ్చింది కదూ! ఆ సెంటిమెంట్‌నే వర్కవుట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు దర్శకుడు కిశోర్ తిరుమల.