చిన్న సినిమా పెద్ద విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమోఘ్ దేశ్‌పతి, అర్చన, శ్రేయా వ్యాస్ హీరో హీరోయిన్లుగా శేరాజ్ దర్శకత్వంలో స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ఇటీవలే విడుదలైన హర్రర్ ఎంటర్‌టైనర్ ‘షాలిని’ చిత్రం విడుదలైన విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దర్శకుడు శేరాజ్ మాట్లాడుతూ-షాలిని చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా నిర్మాత పెట్టుకున్న నమ్మకం నిజం చేసినందుకు ఆనందంగా వుంది. అలాగే లయ న్ సాయి వెంకట్ అందించిన ప్రోత్సాహంతోనే ఈ విజయం దక్కింది అన్నారు. సాయి వెంకట్ మాట్లాడుతూ-చిన్న సినిమా 50 రోజులు పూర్తిచేసుకున్నందుకు ఆనందంగా వుంది. ఈ సందర్భంగా దర్శకుడిని అభినందిస్తున్నాను. ఈరోజుల్లో చిన్న సినిమాలు విడుదలవడమే గగనమవుతున్న సమయంలో ఓ చిన్న సినిమా విడుదలై పెద్ద విజయాన్ని అందుకోవడం గొప్ప విషయం. 15 థియేటర్‌లలో 50 రోజులు పూర్తయింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను స్థాపించడం చిన్న సినిమాలకు పెద్ద వరంగా భావిస్తున్నాను. ప్రతి రూపాయి నిర్మాతకు దక్కుతుంది. ఈ విధానాన్ని అటు ఆంధ్రాలో కూడా అమలుచేయాలని చంద్రబాబుగారిని కోరుతున్నాం అన్నారు. సీనియర్ నటి కవిత మాట్లాడుతూ- చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన చిత్రమిది. దర్శకుడు శేరాజ్‌ను అభినందిస్తున్నాను అన్నారు.