17న ఖాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ హీరో కార్తి, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చతురంగవెట్టై’ చిత్రాన్ని తెలుగులో ‘ఖాకీ’ పేరుతో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా. ‘ద పవర్ ఆఫ్ పోలీస్’ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. నవంబర్ 17న విడుదల చేస్తున్న సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- కార్తి పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. లుక్స్, ఫిజిక్ పరంగా ఆయన చాలా కేర్ తీసుకున్నాడు. నటనలోనూ కార్తి నటన హైలెట్‌గా నిలుస్తుంది. రకుల్‌ప్రీత్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు. నవంబర్ 17న భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, ఎడిటింగ్:నందీశ్వరన్, నిర్మాతలు:ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా, దర్శకత్వం:వినోద్.