సత్తిబాబు దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్‌కి ఈమధ్య వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. కామెడీ హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నరేష్‌కు ఈమధ్య వరుస పరాజయాలు పలుకరిస్తుండడంతో సక్సెస్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మేడమీద అబ్బాయి’ నిరాశపర్చడంతో ఈసారి సరైన హిట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆయన తదుపరి చిత్రాన్ని ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు సిద్ధమయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకే యముడికి మొగుడు, బెట్టింగ్ బంగార్రాజు లాంటి చిత్రాలు తెరకెక్కాయి. కామెడీ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సత్తిబాబుతో అల్లరి నరేష్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.