వెంకటేష్ సరసన..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది అందాల భామ మెహరీన్ ఫీర్జాదా. తాజాగా రవితేజతో చేసిన ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె ఇప్పుడు టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారింది. వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల విజయంతో జోరుమీదున్న మెహరీన్ అటు నటిగా, ఇటు గ్లామర్ పరంగా కూడా తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది. తాజాగా ఈమెకు మరో క్రేజీ అవకాశం దక్కింది. ప్రముఖ హీరో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే, వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా మెహరీన్‌ను ఎంపిక చేశారట. దాంతోపాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్న మెహరీన్, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్న మెహరీన్ స్పీడ్‌ను ఆపలేం.