రాణీ ముఖర్జీకి పితృవియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత బాలీవుడ్ కథానాయిక రాణీ ముఖర్జీ తండ్రి రామ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. గత ఆరేడేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో రామ్ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా రాణీ ముఖర్జీ తండ్రి కోసం చిత్రాల షూటింగ్‌లకు దూరంగా వుంటున్నారు. తండ్రి కోసమే 2012లో నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు. రామ్ ముఖర్జీ హిందీ, బెంగాలీ చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు బాలీవుడ్ నటీనటులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.