టీజర్‌లో తారామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి, ఆండ్రియా, వసంత రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో యశ్వంత్ మూవీస్ సమర్పణలో డివివి సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ నిర్మిస్తున్న ‘తారామణి’ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మారుతి టీజర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా మంచి సినిమా, మహానుభావుడు సినిమా సమయంలో చూసాను, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న సంఘటనలు నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది, దర్శకుడు రామ్ అద్భుతంగా తెరకెక్కించాడు, నిర్మాత వెంకటేష్ స్ట్రయిట్ సినిమా తరహాలో మేకింగ్ చేయించారు, తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు. సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాతకు మంచి ఆనందాలు తేవాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ తమిళంలో రజనీకాంత్, కమలహాసన్‌లు ట్రైలర్‌ను లాంచ్ చేసారు. తెలుగులో మారుతి ట్రైలర్‌ను విడదల చేయడం ఆనందంగా వుంది, ప్రతి కుటుంబాన్నీ డిస్ట్రబ్ చేయడానికి ఎవరో ఒకరు వస్తుంటాడు, అలాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే కథ ఇది, తప్పకుండా అందరిలో అవేర్‌నెస్ కలిగిస్తుంది అన్నారు. బి.ఎ.రాజు మాట్లాడుతూ చిన్న సినిమాలను, చిన్న నిర్మాతలను ప్రోత్సహించడంలో మారుతి ముందుంటాడు, నిర్మాత వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు అన్నారు.