సస్పెన్స్‌గా జర్నీ-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడంలో విజయవంతమైన ‘ముం జాని’ అనే చిత్రాన్ని తెలుగులో జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై చిగులూరి గంగాథర్ చౌదరి అందిస్తున్న చిత్రం ‘జర్నీ-2’. గణేష్, మంజరి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్. నారాయణ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్. నారాయణ మాట్లాడుతూ స్వార్థం లేని నిజమైన ప్రేమ ఎంతో గొప్పదని, అలాంటి ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేరని, అటువంటి వారికి తొలిచూపులోనే ప్రేమ అంకురిస్తుందనే కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. చివరి వరకు సస్పెన్స్ ప్రేమ కథనంతో సాగే ఈ చిత్రం తెలుగువారికి నచ్చుతుందని తెలిపారు. ఈ నెల 15న ఆడియోను, 26న సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి మాటలు : శశాంత్ వెనె్నలకంటి, పాటలు:వెనె్నలకంటి, ఎడిటంగ్ : నాగేశ్వరరావు ఇ.ఎం., కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వం, సంగీతం : ఎస్.నారాయణ.