చెర్రీ కోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో బాక్సాఫీసువద్ద మంచి కలక్షన్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఇప్పటికే ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్‌లో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ రామ్‌చరణ్‌కోసం కథ సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. ఇటీవలే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. ‘బ్రూస్‌లీ’ సినిమా అపజయంతో కాస్త డల్ అయిన చరణ్ మంచి హిట్‌కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. తాజాగా ఆయన నటించే తమిళ సూపర్‌హిట్ రీమేక్ ‘తనిఒరువన్’ సినిమా ఈనెల 21నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతోపాటు సుకుమార్‌తో కూడా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు చరణ్. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.