అందరికీ నచ్చేలా గరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, అదాశర్మ జంటగా మధన్ దర్శకత్వంలో శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై సురేఖ నిర్మిస్తున్న చిత్రం ‘గరం’. ఈ చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధవౌతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా ఇదన్నారు. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందని, తప్పకుండా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అన్నారు. ఆది మాట్లాడుతూ, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని, ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయడం ఆనందంగా వుందన్నారు. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు డిజప్పాయింట్ మాత్రం కారన్నారు. దర్శకుడు మదన్ మాట్లాడుతూ అన్నిరకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన సినిమా ‘గరం’లో తనికెళ్ల భరణి, పోసానిలాంటి రచయితలతో పనిచేయడం ఆనందంగా వుందన్నారు. అదాశర్మ మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా వుందని, ప్రేక్షకులకు మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, పోసాని, నాజర్, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.