26న రాజుగారింట్లో.. విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరత్, అర్జున్, సుస్మిత ప్రధాన పాత్రల్లో ఫిరోజ్‌రాజా దర్శకత్వంలో భరత్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై భరత్‌కుమార్ పీలం నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారింట్లో ఏడవరోజు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత శోభారాణి మాట్లాడుతూ, సినిమా చూడగానే చాలా థ్రిల్‌గా ఫీలయ్యానని, ఇది నలుగురు దొంగలకు సంబంధించిన కథ అని, కొత్తవాళ్లైనా చాలా బాగా నటించారని అన్నారు. ఈ చిత్రాన్ని తమ బ్యానర్ ద్వారా విడుదల చేయడం ఆనందంగా వుందన్నారు. దర్శకుడు ఫిరోజ్‌రాజా మాట్లాడుతూ, హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని, కనిష్క్ అద్భుతమైన నాలుగు పాటలు ఇచ్చాడని, సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 26న విడుదల చేస్తున్నామన్నారు. నిర్మాత భరత్ మాట్లాడుతూ నలుగురు కుర్రా ళ్లు అనుకోని పరిస్థితుల్లో చిక్కుకొని జైలుకెళ్లారని, అది ఎలాగనేది ఈ సిని మా చూస్తే తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రాంతి, అర్జున్, సుష్మిత తదితరులు పాల్గొన్నారు.