4న టెర్రర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, నిఖిత జంటగా అఖండ భారత క్రియేషన్ పతాకంపై సతీష్ కాశెట్టి దర్శకత్వంలో షేక్ మాస్తాన్ రూపొందించిన చిత్రం ‘టెర్రర్’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలించాంబర్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కాశెట్టి సతీష్ మాట్లాడుతూ టెర్రరిజం సమస్య ప్రతి రాష్ట్రంలోనూ ఉందని, హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుసుకున్న ఓ పోలీసు అధికారి ఏలా స్పందించాడు?, జరుగబోయే విధ్వంసాన్ని ఎలా ఆపగలిగాడు అన్న కథా కథనంతో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్ నటన హైలెట్‌గా సాగుతుందని తెలిపారు. ఒక క్లీన్ చిత్రంగా, కమర్షియల్ ఫార్మాట్‌లో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారని, కొన్ని అవార్డులు కూడా వస్తాయని తమ యూనిట్ ఆశిస్తోందని కథానాయకుడు శ్రీకాంత్ చెప్పారు. అన్ని వర్గాలకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం తప్పక విజవంతమవుతుందనే నమ్మకం ఉందని శ్రీకాంత్ అన్నారు. సరైన సమయంలో విడుదల చేయటానికి ఇన్నాళ్ళు ఎదురుచూశామని, ఇపుడు 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉందని నిర్మాత షేక్ మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీభూపాల్, హరి అయినీడి తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ : బస్వా పైడిరెడ్డి, సంగీతం: సాయికార్తీక్, కెమెరా:శ్యాంప్రసాద్, మాటలు: లక్ష్మీభూపాల్, ఎగ్జిక్యూటీవ్ నిర్మాత : హరి అయినీడి, నిర్మాత:షేక్ మస్తాన్, కథ స్క్రీనే్ల ప్లే, దర్శకత్వం : సతీష్ కాశెట్టి.