నిర్మాత కష్టాలేమిటో తెలిశాయి ( యువ హీరో ఆది)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రతి హీరో తన స్వంత
బ్యానర్‌లో ఓ సినిమా చేయాలి. అప్పుడే నిర్మాత కష్టాలేమిటో తెలుస్తాయి’ అని
అంటున్నాడు యువ హీరో ఆది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గరం’. మదన్ దర్శకత్వంలో శ్రీ శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై పి.సురేఖ
నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా హీరో ఆదితో ముఖాముఖి.

పాత్ర గురించి?
ఈ సినిమాలో వరాలబాబు అనే పాత్రలో నటించాను. ఇప్పుడున్న యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే పాత్ర. చాలాకాలం పిల్లలు పుట్టకపోతే వరాలదేవుణ్ణి కోరుకుంటే నువ్వు పుట్టావు, నువ్వు వరానివి కావు శాపానివంటూ నాన్న తిట్టే తరహాలో వుండే పాత్ర. ముఖ్యంగా ‘లవ్‌లీ’, ‘ప్రేమకావాలి’ సినిమా తరువాత బాగా నచ్చిన పాత్ర ఇది.
కాంప్రమైజ్ కాలేదు
ఈ సినిమా కోసం ఏమేమి కావాలనుకున్నామో అన్ని విషయాలను పర్‌ఫెక్ట్‌గా చేశాం. ముఖ్యంగా సెంటిమెంట్, కామెడీ.. ఇలాంటి అంశాలన్నీ వుంటాయి. టెక్నీషియన్, ఆర్టిస్టులందరూ సపోర్టు చేసిన సినిమా ఇది.
మదన్‌తో
మదన్ మంచి డైరెక్టర్ మాత్రమే కాదు, రైటర్ కూడా. ఈ సినిమా సమయంలో మదన్ చెప్పిన కథ బాగా నచ్చింది. పైగా తనకు దర్శకత్వంమీద మంచి పట్టు వుంది. మంచి కథల్ని సినిమాలుగా తెరకెక్కించాడు కాబట్టి ఈ సినిమా కూడా నాకు ప్లస్ అవుతుందనిపించింది. తను చాలా పాషన్ వున్న దర్శకుడు. ఒక సినిమా బాగా రావాలంటే కథ, దర్శకుడు ఇంపార్టెంట్. ఈ రెండు అంశాలు కరెక్టుగా వుంటే ఆ సినిమా బాగా వస్తుంది.
రిస్క్ చేశాం
సినిమా చేయడం అంత సులువుకాదని ఈ సినిమాతో తెలిసింది. అయినా ఆ రిస్క్‌ను ఎంజాయ్ చేశాం. తప్పకుండా ఏ హీరో అయినా ఒక్కసారి సొంత బ్యానర్‌లో సినిమా చేయాలి. అపుడే ప్రొడ్యూసర్‌ల వ్యాల్యూ తెలుస్తుంది. సినిమా తీయడం ఎంత కష్టమో, దాన్ని రిలీజ్ చేయడం మరీ కష్టం. ఈ సినిమాతో నాకు మరింత బాధ్యత పెరిగింది.
తెలుగులోనే
నాన్నకు కన్నడంలో మంచి మార్కెట్ వుంది. కానీ ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేయడం లేదు. ఇదివరకే నాకు ‘పటాస్’ అనే ఓ సినిమా కన్నడంలో వచ్చింది. కానీ ఆ పాత్ర నాకు సూట్ అవ్వదని చేయలేదు. తెలుగులో నాన్న చేసిన పాత్ర ఆయనే చేస్తున్నారు. కల్యాణ్‌రామ్ రోల్ మాత్రం గణేశ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి నా దృష్టి అంతా తెలుగు సినిమా పైనే.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం ‘చుట్టాలబ్బాయి’ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఓ పాటను ఇటీవలే బ్యాంకాక్‌లో చిత్రీకరించాం. నమితా ప్రమోద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతానికి కథలైతే వింటున్నాను. ఇంకా ఏ ప్రాజెక్టు ఫైనలైజ్ కాలేదు.

-శ్రీ