సౌందర్యలా నటించానన్నారు... ‘లజ్జ’ హీరోయిన్ మధుమిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్న కథా చిత్రాలు, సహజత్వానికి దగ్గరగా వుండే సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు నరసింహ నంది. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న ఈ దర్శకుడు తాజాగా రూపొందించిన చిత్రం ‘లజ్జ’. ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది మధుమిత. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమాస్ పతాకంపై ఇటీవల విడుదలైన ఈ సినిమాతో నటిగా సంచలనం సృష్టించిన హీరోయిన్ మధుమిత చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...
‘నేను పెరిగింది హైదరాబాద్‌లోనే. పుట్టింది మాత్రం కర్ణాటకలోని బీదర్‌లో. గ్రాడ్యుయేషన్ పూర్తిచేశా. ప్రస్తుతం ఎల్‌ఎల్‌బి చేస్తున్నాను. స్కూల్లో వున్నపుడే కూచిపూడి, కథక్ నేర్చుకున్నాను. చాలా స్టేజ్ షోలు కూడా ఇచ్చాను. సినిమాలంటే చాలా ఆసక్తి వుండడంతో రోషన్ తనేజా యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘మొగుడు’ సినిమా సమయంలో ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్లాను. ఆ సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఆ సమయంలో కోడైరెక్టర్ అనిల్ చూసి నన్ను నరసింహ నందికి పరిచయం చేశారు. ఆ సమయంలో ఆయన వేరే సినిమా చేస్తున్నారు. నాతో మాట్లాడిన తరువాత ఈ సినిమాకు కాదు, మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అవకాశమిస్తానని చెప్పారు. రెండు నెలల తరువాత ఆయనే ఫోన్ చేసి సినిమాలో నటించాలని చెప్పగానే షాక్ అయ్యాను.
‘లజ్జ’ కథ విన్నపుడే చాలా కొత్తగా అన్పించింది. ఇలాంటి పాత్రను నేను చేయగలనా అనే సందేహం కలిగింది. షూటింగ్ మొదటి రోజు మొదటి షాట్‌లో నా నటన చూసి అందరూ క్లాప్స్‌కొట్టి ‘సౌందర్య’లా నటించావని చెప్పడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇలాంటి కథలు అందరికీ దొరకవు. ఇది బోల్డ్ కారెక్టరే అయినా నటనకు మంచి స్కోప్ వుంది. నాకు టబు, షబానా అజ్మీలే ఇన్‌స్పిరేషన్. ఈ సినిమా విడుదలైన తరువాత వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందమేస్తోంది. థియేటర్‌లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ చూశాను. నిజంగా ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తరువాత ఇప్పటికే తెలుగులో ఓ సినిమాలో నటించాను. అది మధ్యలో ఆగిపోయింది. ప్రస్తుతం మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో రూపొందే చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో రెండు పాత్రలు ఉంటాయి. 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో, మరోటి యూత్‌ఫుల్ అమ్మాయిగా కనిపిస్తాను. ఈ రెండు పాత్రలు నాకు ఛాలెంజింగే’ అంటూ ముగించింది.

-యు