డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరత్ కళ్యాణ్ హీరోగా భరత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా బండారు దానయ్య కవి దర్శకత్వంలో కదిరి శేఖర్‌బాబు నిర్మిస్తున్న చిత్రం ‘డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి’. ఇటీవల సంస్థ కార్యాలయంలో హీరో శరత్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు బండారు దానయ్య కవి చిత్ర విశేషాలను వివరిస్తూ- ‘సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి కథ, కథనాలు కుదిరాయి. ఒక అగ్ర హీరో చేతుల మీదుగా అతి త్వరలో ఆడియోను విడుదల చేస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఇదే బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కబోయే చిత్రానికి విజయదశమి రోజు పూజ కార్యక్రమాలు కూడా జరిపాం.